రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బొంగ్లూర్ సమీపంలో బుధవారం అస్తిపంజరం లభ్యమైనట్లు తెలిపారు. 3 నెలల క్రితం మిస్సింగ్ కేసు నమోదు లో పేర్కొన్న పటేల్ గూడా గ్రామానికి చెందిన యంజాల లక్ష్మయ్య (70) గా కుటుంబ సభ్యులు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గొర్రెల కాపరి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు.