నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఆర్ పవన్ కుమార్ ఎల్లారెడ్డిగూడా హాస్టల్ లో ఉంటూ యుపిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈనెల 20న పరీక్షకు సిద్దమవుతు ఫోన్ కోసం చూసుకోగా కనపడలేదు. పరీక్షకు వెళ్లి వచ్చి హాస్టల్ ఓనర్ తో తన రూమ్ లాకర్ ఓపెన్ చేసి చూడగా, రూ 15 వేల నగదు, ఫోన్, కొన్ని వస్తువులు కనపడలేదు. ఎస్ వెంకటేష్ అనే యువకుడు అదే రోజు నుండి కనపడకపోవడంతో అతని మీద మధుర నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.