వనస్థలిపురంలోని లిటిల్ ల్యాంబ్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామునుండే ఆరాధనలు మొదలు అయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు చర్చ్ లకు చేరుకున్నారు, ప్రార్థనలు చేశారు. గత 46 ఏళ్లుగా ఈ చర్చ్ లో ఎంతో ఐక్యతతో ఈ వేడుకలు జరుపుతున్నామని అధ్యక్షుడు బాబూరావు, జాయింట్ సెక్రెటరీ జాన్ తెలిపారు. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని తెలిపారు.