ఆమనగల్లు: దేవునిపై విశ్వాసం ఉంటే అన్యాయాలను అరికట్టవచ్చు

66చూసినవారు
ఆమనగల్లు: దేవునిపై విశ్వాసం ఉంటే అన్యాయాలను అరికట్టవచ్చు
దేవునిపై విశ్వాసం ఉంటే దేశంలో జరిగే దాడులు, అన్యాయాలను అరికట్టవచ్చని పాస్టర్ భూక్య లక్ష్మణ్ నాయక్ చెప్పారు. బుధవారం ఆమనగల్లులోని ఇమ్మానుయేల్ బైబిల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చర్చీలో ప్రార్థనలు చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయన మార్గంలో పయనించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్