ఆమనగల్లు పట్టణంలోని గిరిజన బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని వసతి గృహం అధికారిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందుకు స్పందించిన కమిషనర్ వసంత బుధవారం నూతన పైపులైను ఏర్పాటు చేసి గేట్ వాల్ బిగించి వసతి గృహానికి త్రాగునీటి సరఫరా చేసి సమస్యను పరిష్కరించారు.