రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజనవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ చౌరస్తాలో శుక్రవారం బాబాసాహెబ్ విగ్రహం వద్ద నిరసనఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు ఎంతో మేలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ని కీర్తించడం బీజేపీకి కంటగింపుగా మారిందని నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేఎల్ఆర్ హాజరయ్యారు.