కరెంట్ షాక్ తో యువకుడు మృతి
మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండలం, లేమురు గ్రామానికి చెందిన కందికంటి సాయి కుమార్ గత నాలుగు సంవత్సరాల నుండి అదే గ్రామములో ఒక షట్టర్ అద్దెకు తీసుకుని అందులో విస్తరాకుల మిషన్ సహాయముతో ప్లేట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. రోజు మాదిరిగానే సాయి కిరణ్ తన షాపుకు వెళ్లి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై, విస్తరాకులు చేసే మిషన్ మీద పడి మృతి చెందాడు.