జిల్లాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం

61చూసినవారు
జిల్లాల్లో మహిళా ఓటర్లదే ఆధిక్యం
వికారాబాద్‌ జిల్లాలో 6, 71, 940 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వారిలో 3, 32, 038 మంది పురుషులు, 3, 39, 885 మంది మహిళలు, 17మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 7, 847 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా కుల్కచర్ల మండలంలో 49,212 మంది ఓటర్లు ఉండగా, తక్కువగా బంట్వారం మండలంలో 17278 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 565 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఈసారి మరో 19 పంచాయతీలు ఏర్పాటయ్యాయి.

సంబంధిత పోస్ట్