పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలి
గండీడ్ మండలం ఆశిరెడ్డిపల్లి, కొంరెడ్డిపల్లి గ్రామాల్లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏఎంఓ శ్రీనివాసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఉపాధ్యాయులు నూతన సృజనాత్మకతతో బోధించాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై 5, 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.