ఘనంగా మైలార్​దేవ్ పల్లి దీక్షా దివస్ కార్యక్రమం

65చూసినవారు
ఘనంగా మైలార్​దేవ్ పల్లి దీక్షా దివస్ కార్యక్రమం
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్​ నవంబర్ 29, 2009న చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ శుక్రవారం మైలార్​దేవ్ పల్లి డివిజన్ లో బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జెండాను ఎగరవేశారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29 అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్