రాజేంద్రనగర్ లో చిరుత పులి కలకలం

73చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో ఆదివారం చిరుత పులి కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం లో చిరుతను చూసిన మార్నింగ్ వాకర్స్ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైనట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడి నుండి చెట్ల లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. చిరుత పాదాలను గుర్తించిన విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్