ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని దుర్గా నగర్ నుండి అరంఘర్ పోయే రైల్వే ట్రాక్ బ్రిడ్జి కింద గత వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా గుంతలు పడి వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.