హరంద్ రెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గల నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జంట హత్యల కలకలం వెలుగు చూసింది. పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యల దారుణ ఘటన చోటుచేసుకుంది. గాలి పటాలు ఎగురవేగడానికి వెళ్లిన స్థానికులు గమనించినట్లు తెలిపారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.