సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను బుధవారం లంగర్ హౌస్ పోలీసులు పట్టుకున్నారు. ఈసందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సాజిత్, సయ్యద్ హుస్సేన్, సయ్యద్ వాలిద్ హుస్సేన్ అనే ముగ్గురు ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో వారిని బుధవారం అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు 30 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు