సనత్ నగర్: షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేసిన తలసాని
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముషీరాబాద్ మండల పరిధిలోని పద్మారావు, భోలక్ పూర్ ప్రాంతాలకు చెందిన 11 మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.