బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేశారంటూ కేటీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు. కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు.