భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన భగవద్గీత సారాంశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆచరించే విధంగా కృషి చేయడమే మా లక్ష్యమని ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్రతన్ తెలిపారు. బుధవారం మాదన్నపేట్ మార్కెట్ గోశాలలో అభిషేకం, నగర్ సంకీర్తనల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అబిడ్స్ ఇస్కాన్ ప్రతినిధి ప్రేమ్రతన్, ఆయన బృందం విచ్చేసి సంకీర్తనలు చేపట్టి హరే కృష్ణ హరే రామ్ మంత్రాన్నీ జపించారు.