ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అనీ షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద స్థానిక రజక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జయంతి నివాళులు అర్పించారు.