షాద్ నగర్ పట్టనంలోని పాఠశాలలో మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు ముందుగా బతుకమ్మకు పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకమ్మ గురించిన విశేషాలను, రోజుల వారిగా ఏ ఏ పేర్లతో బతుకమ్మను చేస్తారో వంటి విషయాలను గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమ సందర్భంగా విద్యార్థులు రకరకాల పువ్వులతో ఎంతో అందంగా బతుకమ్మలను తయారు చేశారు.