పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం: మాజీ ఎమ్మెల్యే

68చూసినవారు
పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం: మాజీ ఎమ్మెల్యే
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే జయంతిని ఆశయ సాధనకు కృషి చేయాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్‌నగర్ కొత్తూరు పురపాలక కేంద్రంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్