సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వారితో జాగ్రత్తగా ఉండాలని స్వేచ్ఛ, సమానత్వం కల్పించే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల సోలిపూర్ చర్చి వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఉద్దేశించి మాట్లాడారు.