ప్రకృతిని ఆరాధిస్తూ. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ అనీ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో బుగ్గారెడ్డి గార్డెన్లో ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థినిలు హాజరయ్యారు.