షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆషాడ మాసం సందర్భంగా 301 కలశాలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. మొదటి బోనాన్ని పోచమ్మ దేవతకు సమర్పించినట్టు యువనేత రాయికల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోనాన్ని ఎమ్మెల్యే శంకర్ స్వయంగా నెత్తిన ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడికూడ జయంతత్ రావు పాల్గొన్నారు.