భారీ వర్షం.. నిండిన చెరువులు, ప్రాజెక్ట్ లు

55చూసినవారు
భారీ వర్షం.. నిండిన చెరువులు, ప్రాజెక్ట్ లు
బొంరాస్ పేట్ మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆది, సోమవారాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. వర్షాలకు పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. వరుసగా మూడో ఏడాది కూడా చెరువు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద యాసంగిలో వెయ్యి ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతుంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారికి పక్కనే చెరువు ఉండడంతో వాహనదారులు అలుగును చూడడానికి తరలి వస్తున్నారు.

సంబంధిత పోస్ట్