రంజిత్‌ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారు: కేటీఆర్‌

85చూసినవారు
రంజిత్‌ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారు: కేటీఆర్‌
చేవెళ్లలో బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి ఇటీవల కాంగ్రెస్ లోకి వెళ్లిన రంజిత్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. 'పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌కు వెళ్లారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ తీవ్రమైన అయోమయంలో ఉంది. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యం' అన్నారు.

సంబంధిత పోస్ట్