బాబా ఆశారాంకు భారీ ఊరట లభించింది. అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఆశారాంకు మధ్యంతర బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవకూడదని కోర్టు ఆదేశించింది.