దేశంలో HMPV వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు కీలక సూచనలు చేశారు. HMPV వైరస్ అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలని సూచించారు. గుంపులతో కూడిన ప్రదేశాల్లో తిరగకూడదని అన్నారు. కాగా జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.