వివాహితపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు

78చూసినవారు
వివాహితపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు
TG: నాగర్ కర్నూల్ జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచాారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి కుటుంబసభ్యులతో ఆలయ పరిసరాల్లోనే నిద్రించారు. వివాహిత రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లగా అక్కడే మద్యం తాగుతున్న ఆటోడ్రైవర్లు, యువకులు దాడి చేసి, దుస్తులు విప్పి.. అవే దుస్తులు, చొక్కాలతో ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. వివాహిత నోట్లో గుడ్డలు కుక్కి.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. నోట్లో మూత్రం పోసి అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్