రావి నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగంగా తనకున్న 700ఎకరాల్లో 500ఎకరాలను పేదలకు పంచారు. 1952 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీచేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ పొందిన నేతగా చరిత్రలో నిలిచారు. నల్లగొండకు ‘నందికొండ ప్రాజెక్టు’, ‘నడికుడి రైల్వే జంక్షన్’ తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. 1957 ఎన్నికల్లో భువనగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడే ప్రతిపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు.