షూటింగ్ కోసం నొప్పిని లెక్కచేయని రవితేజ: హరీశ్‌ శంకర్‌

75చూసినవారు
షూటింగ్ కోసం నొప్పిని లెక్కచేయని రవితేజ: హరీశ్‌ శంకర్‌
రవితేజ ఖాళీగా ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడరు. పనిపట్ల ఆయనకున్న అంకితభావం ఎలాంటిదో తెలియజేసే ఓ ఫొటోని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ సెట్స్‌లో తీసిన పిక్‌ షేర్‌ చేస్తూ.. ‘‘తీవ్రమైన మెడనొప్పితోనూ రవితేజ అన్నయ్య పని చేస్తున్నారు. మాస్‌ మహారాజ్‌ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతిరోజూ మీరు నాకు స్ఫూర్తినిస్తుంటారు’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్