నా వ‌య‌సు చిన్న‌దే.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం: జ‌గ‌న్

59చూసినవారు
AP: ఎన్నికల్లో ఓటమిపై డీలా పడొద్దంటూ వైసీపీ ఎంపీల‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. శుక్రవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. "నా వయసు చిన్నదే, నాలో సత్తువ ఇంకా తగ్గలేదు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడి ద‌య వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి." అని జ‌గ‌న్ సూచించారు.

సంబంధిత పోస్ట్