వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపిక కాకపోవడానికి కారణమదే: రింకు సింగ్

79చూసినవారు
వరల్డ్‌ కప్‌ జట్టుకు ఎంపిక కాకపోవడానికి కారణమదే: రింకు సింగ్
టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. దీనిపై తాజాగా రింకు స్పందించారు. ‘‘మంచి ప్రదర్శన చేసినా జట్టులోకి ఎంపిక కాకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది. ఈసారి నన్ను తీసుకోకపోవడానికి కారణం జట్టు కూర్పే అనుకుంటున్నా. జట్టు ప్రకటన వచ్చాక నేను కాస్త అప్‌సెట్ అయిన మాట వాస్తవం. ఏం జరిగినా మన మంచికే అనుకుంటా’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్