అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. గత 29 రోజుల్లో 4.51 లక్షల మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) వెల్లడించింది. గతేడాది 4.45 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నట్లు పేర్కొంది. శనివారం సుమారు 8,000 మంది యాత్రికులు గుహకు చేరుకుని పూజలు చేశారు. మరో 1,677 మంది యాత్రికులు ఆదివారం లోయకు బయలుదేరారు.