ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ చేసిన వ్యవహారాన్ని జీఎస్టీ అధికారులు ఆలస్యంగా గుర్తించి అప్రమత్తమయ్యారు. ఐదు రాష్ట్రాల్లోని డీలర్ల ఖాతాలను స్తంభింప చేయడం ద్వారా ప్రభుత్వ సొమ్మును కొంత వరకు కట్టడి చేయగలిగారు. జీఎస్టీ ప్రాక్టీషనర్ను అరెస్టు చేసిన అధికారులు ఇప్పటివరకు రూ.11 కోట్ల వరకు వివిధ కంపెనీల నుంచి రికవరీ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 302 మంది వ్యాపారస్థులు ఉండగా, మరో 48 మంది వ్యాపారులు ఐదు రాష్ట్రాల్లో ఉన్నట్లు నిర్ధారించారు.