ఎర్ర బచ్చలి కూరతో ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్ ఈ, సీ, కే, ఐరన్, కాల్షియం వంటి ముఖ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఎర్ర బచ్చలికూర అద్భుతమైన ఆప్షన్. ఎర్ర బచ్చలి కూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. అలాగే మలబద్ధకంతో పోరాడుతుంది. సీజనల్ వ్యాధులతో పోరాటంలో సహాయపడుతుంది.