'ఆరోగ్య బీమాపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించండి'

71చూసినవారు
'ఆరోగ్య బీమాపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించండి'
ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని బీమా ఏజెంట్లు, పాలసీదారులు కోరుతున్నారు. 2047కి ప్రతి ఒక్కరికీ బీమా అందించాలనే ఐఆర్‌డీఏఐ లక్ష్యం నెరవేరడానికి ఇదే మార్గమంటున్నారు. అలాగే ప్రస్తుతం సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు రూ.25వేల వరకే మినహాయింపు ఉందని, దీన్ని రూ.50వేల వరకు పెంచాలంటున్నారు. కొత్త బడ్జెట్‌లో వీటి ప్రస్తావన చేయాలని విన్నవిస్తున్నారు.

సంబంధిత పోస్ట్