ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇష్టారీతిన రీల్స్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తనిఖీలు చేసి పాతవాటిపైనా కేసులు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రోడ్డుపై నోట్లు వెదజల్లుతూ రీల్స్ చేసిన ఓ యువకుడిపై 3 PSలలో కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బైకులపై స్టంట్లు చేయడం, నోట్లు జల్లడం, అభ్యంతరకరంగా ఉండే వీడియోలు చేస్తే బాధ్యులను గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.