రెమాల్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

1576చూసినవారు
రెమాల్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీని కారణంగా బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక రెమాల్ తుఫాన్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్