తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించనునున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మన్మోహన్ కు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ సైతం ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం అర్పించి అంజలి ఘటించారు. పలువురు రాజకీయ నేతలు, ఇతరులు నివాళులర్పిస్తున్నారు.