సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు పేరు చెప్పి రెండు అడ్వర్టైజింగ్ సంస్థలు తనను బెదిరిస్తున్నారు అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం ఓ వీడియోను విడుదల చేసింది. చిన్న అడ్వర్టైజింగ్ కంపెనీ నడుపుకుంటున్న మహిళను.. సీఎం రేవంత్ తమ్ముడు పేరు చెప్పి రెండు అడ్వర్టైజింగ్ సంస్థలు 4 నెలలుగా బెదిరిస్తున్నాయని ఆమె తెలిపింది. ఇంతకుముందు ఉన్న అడ్వర్టైజింగ్ బోర్డులను అక్రమంగా తొలగించి వాళ్ళ బోర్డులను పెట్టుకుంటున్నారని తెలిపింది.