గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసు డల్ గా బయటనిల్చుంటే రిషి-గౌతమ్ అక్కడకు వస్తారు. గౌతమ్ వసుధారతో అదేపనిగా మాట్లాడతాడు. చెప్పకుండా వచ్చామని ఏం అనుకోవద్దు. ముందు ముందు ఇంకా చాలా సప్రైజ్ లు ఉంటాయే లే అని. ఏంటి అలా ఉన్నారు పొద్దున్న డల్ గా ఉంటే ఆరోజు అంతా అలానే ఉంటుంది అని ఇంట్లోకి పిలవ్వా, మర్యాదలు ఇలాంటివి ఏవి ఉండవా అని అడుగుతాడు. వసూ రండి సార్ నేను కాలేజ్ కి వెళ్లే తొందరలో ఉన్నాను అంటుంది. వద్దులే వసుధార అంటాడు రిషి. గౌతమ్ మాత్రం వసుధార అంత అభిమానంగా పిలుస్తుంటే వెళ్లకపోతే ఏం బాగుంటుంది అని ముగ్గురు లోపలికి వెళ్తారు. గౌతమ్..ఇంతకీ ఎందుకు వచ్చినట్లురా నువ్వు అని అడుగుతాడు. రిషీ మనసులో నువ్వు నన్ను లాక్కొచ్చి ఇక్కడ ఇరికిస్తున్నావా అనుకుని మిషన్ ఎడ్యుకేషన్ టాపిక్ తీస్తాడు. మేడం నేను చెప్పిన పని మొదలెట్టిందో లేదో తెలియాలంటే ఇన్ డైరెక్ట్ గా అడగాలని అనుకుంటాడు. డల్ గా ఉన్నావేంటి అంటే అలా ఏం లేదు అంటుంది వసూ. బయట కారు లేదు మేడం ఇంట్లో లేరా అన్న రిషితో మేడం కాలేజీకి వెళ్లారని చెబుతుంది వసూ. మరి నువ్వెలా వస్తావని అడిగితే నేను ఈ సౌకర్యాలకు, కార్లకు అలవాటు పడలేదు. ఆటోలను మర్చిపోలేదు సార్ అంటుంది. గౌతమ్ మా కారులో వెళ్దాం రండి అంటుంది. రిషీ కూడా రమ్మంటాడు. వసు తప్పక వెళ్తుంది.
రిషీ.. వసుని హాస్టల్ పంపించే పని ఎంతవరకూ వచ్చిందని మేడంని ఎలా అడగాలని రిషీ ఆలోచిస్తాడు. గౌతమ్ వాటర్ అడిగితే రిషీ లేవంటాడు. వసుధార ఇస్తా అంటే వద్దంటాడు. పోనీ కొబ్బరిబోండాలు తాగుదామా అంటాడు. గౌతమ్..పొద్దున్నే కొబ్బరిబోండాలు ఏంట్రా అంటాడు రిషీ. ఇలా చిన్నప్పటి విషయాలు రిషి ఏమైనా చెప్పాడా అంటూ గౌతమ్ వసూతో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. రిషీ ఆపడాని చూస్తాడు. రిషి ఏం చేసినా నాకు చెప్పకుండా చేసేవాడు, నేను మాత్రం చెప్పే చేసేవాడిని అని. వసుధార నీ గురించి చెప్పు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటాడు. రిషీ నోరు మూసుకో అంటాడు. గౌతమ్..ఏంట్రా నువ్వు, నీళ్లు అడిగాను వద్దన్నావు, బొండాలు అన్నాను వద్దన్నావు. ఏదో ఘోరం జరిగినట్లు సైలెంట్ గా కుర్చోవాలా అంటాడు. రిషీ కారు ఆపి దిగరా అంటాడు. గౌతమ్ జోక్ చేస్తున్నావ్ కదరా అంటాడు. రిషీ మళ్లీ సీరయస్ గా దిగమని చెప్పానా అంటాడు. గౌతమ్ ఇలా మధ్యలో దింపేస్తే నేను ఏం కావాలిరా అంటే మధ్యలో ఎలా దింపేస్తారా క్యాబ్ బుక్ చేశాను వెనుక ఉంది వెళ్లు అంటాడు. గౌతమ్ పాపం ఎంత బతిమిలాడినా రిషీ మాత్రం తగ్గడు. ఇంటికి వెళ్లి బొమ్మలు గీసుకో అంటాడు. వసూ మీరు బొమ్మలు గీస్తారా అంటే ఆ అన్నీ నీ బొమ్మలు గీసి నీకే ఇస్తాడులే కానీ. నువ్వు ముందుకు రా అంటాడు. కారు దిగి ఏ ఒక్క అవకాశం దొరకనివ్వడం లేదని అనుకుని క్యాబ్ ఎక్కుతాడు. తర్వాతి కథ ఎపిసోడ్ లో చూడాల్సిందే.