వయనాడ్ విషాదంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు దాదాపు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ కనుమల్లోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచి ఉంది. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలి" అని ప్రభుత్వాన్ని కోరారు.