డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు

81చూసినవారు
డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు
దోమల ద్వారా వచ్చే డెంగ్యూ వ్యాధి వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన మొదటి రెండు నెలల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని తెలిపారు. సాధారణంగా డెంగ్యూ బాధితుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో డెంగ్యూ ప్రభావం మెదడు, నాడీ వ్యవస్థపై కూడా పడుతుందని, ప్రాణాంతకమైన స్ట్రోక్‌లకు కారణమవుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్