కరాచీలోని గులిస్తాన్-ఇ-జౌహర్ ప్రాంతంలో జులై 3న దారుణ ఘటన జరిగింది. ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దానికి ముందే అతడు తన షార్ట్ తొలగించాడు. బాధితురాలు అతడిని ప్రతిఘటించి గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు తన బైక్‌పై పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని సింధ్ మంత్రి షర్జీల్ మెమన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.