మణిపూర్ లో ఓ స్కూల్ బయట గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపిన ఘటన గురువారం జరిగింది. ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని స్థానిక శిశు నిష్తా నికేషన్ స్కూల్ ఎదుట ఈ ఘటన జరగ్గా మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. ఉద్రిక్తతల కారణంగా గత 2 నెలలుగా అక్కడ స్కూల్స్ మూతపడ్డాయి. తాజాగా, బుధవారం పాఠశాలలు తెరుచుకోగా, మరుసటి రోజే ఈ దారుణం జరిగింది. దీంతో
విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.