పాలిసెట్లో తొలిసారిగా స్లైడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీంతో పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఒక బ్రాంచిలో చేరిన
విద్యార్థులు మరో బ్రాంచిలో మారవచ్చు. కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తారు. ఇప్పటివరకు పాలిసెట్లో రెండో విడతల కౌన్సిలింగ్ నిర్వహించి మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఓ కళాశాలలో ఖాళీగా ఉన్న బ్రాంచీల్లో ఆ కళాశాలకే చెందిన మరో బ్రాంచి
విద్యార్థులు జాయిన్ అవ్వొచ్చు.