రాబోయే బడ్జెట్‌లో కొత్తగా ‘రోబో ట్యాక్స్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది? ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో వృద్ధిరేటు, ఉద్యోగ కల్పన, ఆర్థిక విధానాలు, పెట్టుబడులు, రుణ భారం, ఆహార ద్రవ్యోల్బణం వంటి ప్రధానాంశాలపై నిపుణులతో మంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రోబో ట్యాక్స్’ పరిశీలన తెరపైకి వచ్చింది.