రొమాన్స్ సీన్.. తాత ముసిముసినవ్వులు (వీడియో)

75చూసినవారు
రీసెంట్ గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీలో టిల్లు స్పాంటేనియస్ పంచులు, యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిన ఓ పెద్దాయన తెగ సిగ్గు పడిపోయారు. సిద్ధూ, అనుపమ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సన్నివేశం చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. పక్కనే ఉన్న కుర్రాళ్లు ఈ తాత నవ్వుతున్న సన్నివేశాన్ని వీడియో తీయడంతో అది నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్