తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయం.. VIDEO

76చూసినవారు
AP: తిరుపతి నగరంలో కుళ్లిన చికెన్ విక్రయం ఘటన కలకలం రేపింది. అన్ని షాపుల్లో కిలో చికెన్ను రూ.220 నుంచి రూ.240 దాకా విక్రయిస్తుండగా, ఓ దుకాణంలో తక్కువ ధరకే విక్రయిస్తుండటంపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన కోళ్ల మాంసాన్ని రోజుల తరబడి డీప్ ఫ్రీజర్లో భద్రపరిచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దుకాణాన్ని సీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్