ప్రేమ విఫలమవడంతో చనిపోతున్నానని లేఖ రాసి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

568చూసినవారు
ప్రేమ విఫలమవడంతో చనిపోతున్నానని లేఖ రాసి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ప్రేమ విఫలమై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. యూపీకి చెందిన పవన్ కుమార్(34) మౌలాలీలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. పవన్ ఈ నెల 23 నుంచి కనిపించకపోవడంతో గాలించగ బెటాలియన్ పరిపాలన భవనం వెనుక కేబుల్ వైర్లతో ఉరి వేసుకుని శవమై కనిపించాడు. తన స్వస్థలానికి చెందిన యువతితో ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా మృతుడి జేబులోని లేఖలో రాసి ఉందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్